- తహసిల్దార్ టివి రోజా
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో రెండు పడక గదుల ఇండ్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తహసిల్దార్ టివి రోజా సూచించారు. మంగళవారం ఇందల్ వాయి గ్రామంలో డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ టివి రోజా మాట్లాడుతూ రెండు పడక గదుల కొరకు అర్హులైన లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శి భరత్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫోటో, కులం సర్టిఫికెట్ జతచేసి గ్రామ కార్యదర్శి భరత్ కు అందజేయాలని పేర్కొన్నారు. గ్రామ సభ ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గతంలో రెండు పడక గదుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ గ్రామంలో ఎవరైనా మిగిలిపోయిన అర్హులైన పేదలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని గ్రామంలో ఇల్లు భూములు లేనివారు పూర్తిగా పేదవారై ఉండి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రెండు పడక గదుల కొరకు దరఖాస్తులు మూడు రోజులపాటు గ్రామంలోని గ్రామ కార్యదర్శి దరఖాస్తులు స్వీకరిస్తారని గ్రామంలోని ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలు ఈ సదా అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని తాహసిల్దార్ టివి రోజూ తెలిపారు. మొత్తం రెండు పడక గదులు గ్రామంలో 48 ఉండగా గతంలో 150 దరఖాస్తులు వచ్చాయని అలాగే ఇప్పుడు మూడు రోజులు దరఖాస్తులు చేసుకున్న వారు అందరూ లిస్టు కలిపి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నట్లయితే వారిని డ్రాప్ పద్ధతిన ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు.

రెండు పడక గదుల గురించి ఎవరైనా దళారులు మేము ఇప్పిస్తామని డబ్బులు ఇవ్వాలని అడిగితే ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని, ప్రభుత్వం పేదలకు ఉచితంగా రెండు పడక గదులు నిర్మించి ఇస్తుందని, ఎవరు కూడా దళారులను నమ్మవద్దని తాహసిల్దార్ రోజా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి షేక్ వాహిద్, సర్పంచ్ పాశం సత్యమ్మ నర్సింలు, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, ఉప సర్పంచ్ రాజేందర్, గ్రామ కార్యదర్శి భరత్ పంచాయతీ కరోబార్ పోచయ్య, విడిసి సభ్యులు గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.