నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని తీగలకుంటపల్లి, పలు గ్రామాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రధాన కూడళ్ళలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన ఫ్యాక్స్ ఛైర్మన్ పెర్యాల దెవేందర్‌రావు మాట్లాడుతూ ప్రతీ పేదకుటుంబానికి రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అన్నారు. ఆయన ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనం, కులవివక్షలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు.
రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమాలలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వేల్పుల జాన్, కార్యదర్శి బందెల రాజమౌళి, మాజీ అధ్యక్షుడు మంద మల్లేశం, తలారి నర్సయ్య, వేల్పుల వెంకటస్వామి, ఆరె జగదీష్, తీగలకుంటపల్లి కార్యదర్శి ఇరుమల్ల శ్రీనివాస్, వార్డ్ సభ్యులు కొమ్మిడి సంజీవరెడ్డి, గుడిపల్లి రాజు, కో ఆప్షన్ సభ్యులు పుల్లగుర్ల రాజిరెడ్డి, బస్వరజ్ రామచంద్రం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు యటల మహేందర్, ముత్త సారయ్య, మెట్టు వెంకట్‌రెడ్డి, పొన్నాల ఎల్లయ్య, రాగుల రామస్వామి, వేల్పుల కొమురెళ్ళి, బాకురి మహేందర్, వేల్పుల మధు, పొన్నల బాలకిషన్, పొన్నాల ప్రశాంత్, వేల్పుల ప్రశాంత్, బైరి ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 07:07PM