నవతెలంగాణ-కోహెడ
మండలంలోని వరికోలు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు యామ రాజు ఇటీవల న్యూఢల్లీిలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతీబాపూలే అవార్డు అందుకోవడం పట్ల ను మంగళవారం మోడల్‌స్కూల్ పాఠశాలలో వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖ ఏడీ వెంకటేశ్వర్‌రెడ్డిలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సత్కారాలతో మరింత ప్రోత్సాహం వస్తుందని, రానున్న రోజులలో మరింత మంచిస్థానం సంపాదించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పావని, కోహెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాయిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వరికోలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నరేందర్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 07:29PM