నవతెలంగాణ-భిక్కనూర్
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్సత్రిలో వైద్యురాలు దివ్య కు ఆశా కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పనులను తమతో చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని, కంటి వెలుగు, టీవీ సర్వే, కుష్టు రోగ నిర్ధారణ సర్వే పేరిట శ్రమకు మించి పనులు చేయిస్తూ వాటికి వచ్చే డబ్బులను ఇవ్వడం లేదని, తమకు 26 వేల రూపాయల వేతనాన్ని అందజేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
గతంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో విధులు నిర్వహించిన వాటికి సంబంధించిన డబ్బులను తమకు ఇవ్వకుండా అధికారులు వాడుకున్నారని, తమను అన్ని విధాలుగా శ్రమ దోపిడికి గురి చేస్తూ, అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ జనాభాయ్, మండల ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు లావణ్య, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 07:30PM