నవతెలంగాణ హైదరాబాద్: మీరు స్పాటిఫైలో సంగీతం లేదా పాడ్‌క్యాస్ట్‌లను వింటూ ఉంటే, మీకు బహుశా వ్రాప్డ్ గురించి బాగా తెలిసి ఉంటుంది. లేదంటే, మొదటి సారి దాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం అవ్వండి. ఇది మీరు 2022లో ఆలకించిన ఇష్టమైన పాటలు, కళాకారులు, పాడ్‌క్యాస్ట్‌లు తదితరాలన్నింటి సారాంశం అని చెప్పవచ్చు.
భారతదేశంలో 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన స్పాటిఫై వ్రాప్డ్ (Spotify Wrapped) అనేది ఒక ఇంటరాక్టివ్ మరియు పర్సనలైజ్డ్ ఇన్-యాప్ అనుభవం. ఇది ఆ ఏడాదిలో శ్రోతలు ఆలకించిన ఆడియో ఎలా ఉందో గుర్తు చేస్తూ, వారిని ఉత్తేజపరుస్తుంది. ప్రతి ఏడాది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అర్హతగల స్పాటిఫై వినియోగదారులు ఈ వార్షిక స్వీయ-వ్యక్తీకరణ సంప్రదాయాన్ని జరుపుకుంటారు. సోషల్ మీడియా లోపల, వెలుపల ఆడియో పట్ల తమ ప్రేమను అభివ్యక్తీకరిస్తారు. ఈ సంవత్సరం భారతదేశంలో టాప్ లిస్ట్‌లలో ఎవరు ఉన్నారో ఇక్కడ చూద్దాం:
సింగర్-కంపోజర్ Arijit Singh వరుసగా మూడవ సంవత్సరం భారతదేశంలో స్పాటిఫైలో అత్యధికంగా ప్రసారం చేయబడిన కళాకారుడిగా కొనసాగారు. అలాగే #2వ స్థానంలో Pritam, A.R. Rahman #3వ స్థానంలో, Anirudh Ravichander #4వ స్థానంలో, Shreya Ghoshal #5వ స్థానంలో ఉన్నారు.
ఏపీ ధిల్లాన్ “Excuses”, ఇంటెన్స్, గురిందర్ గిల్ భారతదేశంలో స్పాటిఫైలో అత్యధికంగా ప్రసారం చేయబడిన పాట కాగా, 2022లో 19 కోట్లకు పైగా స్ట్రీమ్‌లు వచ్చాయి. తదుపి స్థానంలో షే గిల్ “Pasoori”, అలీ సేథి, జుల్ఫికర్ జబ్బర్ ఖాన్, అబ్దుల్లా సిద్ధిఖీ #2 స్థానంలో మరియు ప్రీతమ్, అరిజిత్ సింగ్, అమితాబ్ భట్టాచార్య రచించిన “Kesariya” #3వ స్థానంలో కొనసాగింది.
సిద్ధూ మూస్‌వాలా “Moosetape” భారతదేశంలో స్పాటిఫై శ్రోతలు అత్యధికంగా స్ట్రీమ్ చేసిన ఆల్బమ్, ఆ తర్వాత “Shershaah”, ఏపీ ధిల్లాన్ “Hidden Gems”, “Kabir Singh” మరియు ప్రీతమ్ “Brahmastra” ఉన్నాయి. భారతదేశంలో స్పాటిఫై ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన ఎడిటోరియల్ ప్లేలిస్ట్ Hot Hits Hindiకి 11 లక్షల కన్నా ఎక్కువ మంది శ్రోతలు ఉన్నారు. Punjabi 101, Latest Tamil, Hot Hits Tamil మరియు Bollywood Mush తదితర ప్లేలిస్టులను శ్రోతలు చాలా ఇష్టపడ్డారు.
పాడ్‌క్యాస్ట్‌ల విషయానికొస్తే, The Sex Podcast by Leeza Mangaldas ఈ ఏడాది భారతదేశంలో స్పాటిఫైలో అత్యధికంగా ప్రసారం చేయబడిన పాడ్‌కాస్ట్. ఆ తర్వాత The Mythpat Podcast, The Ranveer Show, Chanakya Niti మరియు On Purpose with Jay Shetty ఉన్నాయి. ఇంద్రావతి చౌహాన్, నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ల ఊ అంటావా ఊ ఊ అంటావా (Oo Antava Oo Oo Antava) భారతదేశంలో స్పాటిఫైలో 2022లో అత్యధికంగా ప్రసారం చేయబడిన తెలుగు పాట.
2022 వ్రాప్డ్ ఫీచర్‌లు
ఈ సంవత్సరం వ్రాప్డ్ అనుభవం ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటితో పాటు కొత్త ఫీచర్‌లతో నిండి ఉంది. ఇది ప్రతి అభిమాని ప్రత్యేకంగా ఆలకించేందుకు ఇష్టపడుతున్న గుర్తించింది. మీరు స్ట్రీమ్ చేసిన కళాకారుల, పాటలు, కళా ప్రక్రియలు మరియు మ్యూజిక్ మినిట్స్ వార్షిక టాప్ లిస్టులతో పాటు, అనేక కొత్త ఫీచర్‌లు ఉన్నాయి.
ఆడియోలో మీ సంవత్సరాన్ని వ్యక్తీకరించేందుకు మీ కొత్త డేటా స్టోరీలు: Your Listening Personality అనేది మీరు వినే సంగీతం గురించి మాత్రమే కాకుండా మీ సంగీత అభిరుచిని విశ్లేషించే కొత్త, ఉల్లాసభరితమైన ఫీచర్. అభిమానులు వారి 2022 లిజనింగ్ పోకడల ఆధారంగా 16 విభిన్న స్పాటిఫై-సృష్టించిన లిజనింగ్ పర్సనాలిటీ రకాల్లో వాటిని తెలుసుకుంటారు. అదనంగా, ఆడియో డే అనేది ఇంటరాక్టివ్ స్టోరీ, ఇది రోజంతా మీ సంగీత అభిరుచి ఎలా అభివృద్ధి చెందింది అనే అంశాన్ని మీకు తెలియజేస్తుంది.
ఇది 2021లో 100 కన్నా ఎక్కువ మంది ఆర్టిస్టుల సందేశాలతో హిట్ ఫీచర్‌గా నిలిచింది. ఈ ఏడాది అనిరుధ్ రవిచందర్, అనువ్ జైన్, అర్మాన్ మాలిక్, ఎ.ఆర్. రెహమాన్, అసీస్ కౌర్, బాద్షా, దర్శన్ రావల్, జి.వి. ప్రకాష్, హార్డీ సంధు, జోనితా గాంధీ, కరణ్ ఔజ్లా, కింగ్, కృష్ణ (KR$NA), నేహా కక్కర్, ప్రతీక్ కుహద్, రఫ్తార్, రిత్విజ్, శ్రేయా ఘోషల్‌తో సహా 40,000 కన్నా ఎక్కువ మంది కళాకారుల నుండి సందేశాలను చేర్చుతూ దీన్ని మేము విస్తరించాము. మీ ఆర్టిస్ట్ మెసేజ్‌లతో, అర్హత ఉన్న అభిమానులు 2022లో వారి అగ్ర ఆర్టిస్టుల నుంచి కృతజ్ఞతా సందేశాలతో పర్సనలైజ్ వీడియో ఫీడ్‌ను అందుకుంటారు. ప్రతి వీడియోతో మీరు ఏడాది ఆ కళాకారుడి నుంచి ఎక్కువగా వింటున్న పాట ఉంటుంది. స్పాటిఫై అభిమానులు తమ వ్రాప్డ్ కార్డ్‌లను షేర్ చేయడానికి ఇష్టపడతారని మాకు తెలుసు, కనుక ఇప్పుడు ఈ ఏడాది, మేము వాట్సప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వ్రాప్డ్ కార్డ్‌లను షేర్ చేసే సామర్థ్యాన్ని జోడించాము.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 07:31PM