- సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్
నవతెలంగాణ-భిక్కనూర్
సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో పాల్గొన్న యువకులు ఆత్మవిశ్వాసంతో పరిగెత్తి విజయం సాధించాలని సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్న యువతీ యువకులకు అవగాహన నిర్వహించారు. పక్క వారితో పోల్చుకొని పరిగెత్తకుండా తమ ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో పరిగెత్తి ఈవెంట్స్ లో గెలుపొందాలన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి గెలుపొందినప్పుడే తమ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm