నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలం లోని పసర గ్రామంలో మంగళవారం ఎంఆర్పిఎస్ కార్యాలయం నందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతిని తోకల రాంబాబు మాదిగ ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు జిల్లా కన్వీనర్ ఇరుగు పైడి హాజరై మాట్లాడారు.
ముందుగా సెగ్గోజు రవీంద్ర చారి బీసీ సంఘాల నాయకులు, మడిపల్లి శ్యాంబాబు ఎంఎస్పి ములుగు జిల్లా నాయకులు, పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇరుగుపైడి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించి పెట్టిన తమ ఓటు హక్కును వినియోగించుకుని ఈ రాజ్యాన్ని ఏలాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ ఒకే తాటిపై ప్రయాణించే విధంగా మందకృష్ణ ఆలోచన విధానాన్ని అమలు అయ్యే విధంగా కలిసికట్టుగా ప్రయాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మడిపెళ్లి వెంకటేష్, వీహెచ్పీఎస్ నాయకులు రాము. ఇరుగు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 07:39PM