- ఏర్గట్ల ఎస్సై రాజు
నవతెలంగాణ-ఏర్గట్ల
మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో కేజ్ వీల్ ట్రాక్టర్ల యజమానులతో, డ్రైవర్లతో ఎస్సై రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ కేజ్ వీల్ ట్రాక్టర్లు బీటి, సీసీ రోడ్లపై నడపడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, వాహనదారులు ప్రయాణించేటప్పుడు ప్రమాదాలకు గురౌతున్నారని, రోడ్లు ధ్వంసం కాకుండా ఉండేందుకు ట్రాక్టర్లు నడిపేటప్పుడు తమ కేజ్ వీల్స్ కు పట్టీలు వేసి నడపాలని మండలంలోని ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్లకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm