నవతెలంగాణ-కంటేశ్వర్
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు సిటీ యూనివర్సిటీ లో న్యూ ఢిల్లీకి చెందిన అఖిల భారత యూనివర్సిటీ (AIU) అసోసియేషన్ వారు నేటి నుండి (07/12/22) నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలకు తెలంగాణ యూనివర్సిటీ తరపున ఆడడానికి బయల్దేరిన యూనివర్సిటీ కబడ్డీ టీంలో కేర్ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నాగేశ్, మల్లేష్ మరియు అసద్ లు ఉండడం గర్వంగ ఉందని కేర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ అన్నారు. విద్యార్థులకు కోచింగ్ ఇచ్చిన పూర్వ కబడ్డీ క్రీడాకారుడు గజన్ ను కూడ ఈ సందర్భంలో అభినందించారు. కేర్ డిగ్రీ కళాశాల క్రీడలకు కొంగుబంగారం ఉండడం సంతోషాన్ని ఇస్తుందని నరాల సుధాకర్ అన్నారు.
కేర్ డిగ్రీ కళాశాల నుండి జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడాకారులుగ ఎందరో ఎదిగారని గుర్తుచేస్తారు. కేర్ డిగ్రీ కళాశాలలో క్రికెట్, ఫుట్బాల్, హాకి, కబడ్డీ, మొదలగు ఆటలకు ప్రోత్సాహం ఎల్లప్పుడు ఉంటుందని నరాల సుధాకర్ అన్నారు. కబడ్డీ క్రీడాకారులను ప్రొత్సహిస్తున్న ఆంద్యాల లింగం గారికి, సాయాగౌడ్ కి, సుబ్బారావు సార్ కు మరియు కోచ్ ప్రశాంత్ లకు ఈ సందర్భంలో ధన్యవాదములు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 08:45PM