- కనువిప్పు కార్యక్రమంలో ఎస్ఐ నరేశ్ రెడ్డి సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
అధునిక సాంకేతిక పరిజ్ఞానం విసృతంగా అందుబాటులోకి వచ్చిన అనంతరం కూడా ప్రజలు మూడనమ్మకాలను నమ్ముతూ మోసపోవద్దని ఎస్ఐ నరేశ్ రెడ్డి ప్రజలకు తెలిపారు. మంగళవారం మండల పరిదిలోని రేగులపల్లి గ్రామంలో మూడనమ్మకాలు, సైబర్ నేరాలపై ప్రజలకు సిద్దిపేట పోలిస్ శాఖ కళాబృందం అద్వర్యంలో కళజాత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ నరేశ్ రెడ్డి మాట్లాడుతూ చట్టాలు, పోలిసుల విధులపై అవగాహన కలిగియున్నప్పుడే నేరాలను కట్టడి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తామని రాష్ట్ర పోలిస్ శాఖ అందిస్తున్న డయల్ 100, షీ టీమ్స్, బ్లూ కోల్ట్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమేరాలు కీలకమని దుకాణాల యాజమానులు విధిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వార్డ్ సభ్యులు, పోలిస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్తులు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 09:28PM