నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మనుమయ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మికి సంఘం సభ్యులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ బ్రహ్మచారి, వడ్ల శ్రీనివాస్, పెద్ద ఎత్తున మనుమయ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm