నవతెలంగాణ-భిక్కనూర్
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మరణించిన సంఘటన మండలంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన బొంది లింగం (45), లలిత భార్యాభర్తలిద్దరూ తమ వ్యక్తిగత పనుల నిమిత్తం భిక్నూర్ పట్టణానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అతి వేగంగా, అజాగ్రత్తగా నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనంపై ఉన్న లింగం అక్కడికక్కడ మరణించగా, లింగం భార్య లలితకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన లలితను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ తరలించారు. ఈ మేరకు శవాన్ని పొస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2023 06:53PM