నవతెలంగాణ - తాడ్వాయి
మినీ మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జంపన్న వాగులో 2 ఇన్ఫీల్ ట్రేషన్ బావుల్లో పేరుకుపోయిన ఇసుక పూడికను తీస్తున్నారు. ఒక్క బావికి నలుగురు, ఐదుగురు చొప్పున వ్యక్తులు బావిలోకి దిగి తాళ్లతో కట్టిన గంపలతో కూడికను నింపుతున్నారు. బావి పైన ఉన్న వారు తాళ్లతో గంపను పైకి లాగి బయట పోస్తున్నారు. రెండు బావుల నుంచి చాలా లోతు వరకు వెళ్లి పూడిక తీత పనులు నిర్వహిస్తున్నారు. దాదాపు రెండు బావుల పూడికతీత పనులు పూర్తి కాగానే, వాటి కి మోటర్ అమర్చి జంపన్న వాగు స్నానగట్టాల షవర్లకు, తాగునీటి కోసం సరఫరా చేస్తామన్నారు. ఈ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm