నవతెలంగాణ-భిక్కనూర్
యువత చదువుతోపాటు క్రీడలలో రాణించాలని బజరంగ్దళ్ మండల అధ్యక్షుడు అవధూత నవీన్ సూచించారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల పోటీలో గెలుపొందిన ఇరు జట్లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ ఉపాధ్యక్షుడు భాస్కర్, మండల గో సంరక్షణ అధ్యక్షుడు సంజయ్, చంద్రశేఖర్ గౌడ్, సందీప్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm