నవతెలంగాణ - డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనపూర్ గ్రామానికి చెందిన కర్జూరం పోసాని 55 బీడీలు చేస్తు ఉండేదని, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, భరించలేక గురువారం మధ్యాహ్నా సమయం లో తన ఇంట్లోని దూలానికి తాడుతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్ఐ కచ్చాకాయల గణేష్ తెలిపారు. మృతురాలి కొడుకు కర్జూరం సాయికుమార్ తన తల్లి మరణంపై ఎటువంటి అనుమానం లేదని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ కచ్చాకాయల గణేష్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm