నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ మండలంలోని కాచాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్టేజి నిర్మాణానికి ఎంపీపీ గాల్ రెడ్డి, సర్పంచ్ బైండ్ల సులోచన సుదర్శన్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్పంచ్ సులోచన సుదర్శన్ తమ సొంత ఖర్చుతో పాఠశాల ఆవరణలో స్టేజి నిర్మాణం చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్, ఉప సర్పంచ్ సిద్ధ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధా లక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ చారి, చంద్ర లీల, ఎంఈఓ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ వైద్య సంపత్, గ్రామ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.