నవతెలంగాణ-బెజ్జంకి
చాలీ చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వేతనాలు పెంచాలని కోరుతూ వీవోఏలు గురువారం మానకోండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వినతిపత్రమందజేశారు.గ్రామాల్లో మహిళ సంఘాల్లోని సభ్యులను సమన్వయం చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తూనే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రతతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. వీవోఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల,వీవోఏలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm