నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుధకర్ పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm