- అంత్రిక్ సురక్ష సేవా పథకం అందుకున్న తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు
నవతెలంగాణ -తాడ్వాయి
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు ఆంత్రిక్ సురక్ష సేవా పథకం-2023 ములుగు జిల్లా తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావుకు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ పథకానికి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన 13 మందికి ఈ అవార్డు దక్కడం గర్వకారణం. వెంకటేశ్వరరావు పోలీసు శాఖలో సేవలందిస్తూ, వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలాన్ని శాంతియుత మండలం గా అభివృద్ధి చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఏజెన్సీలోని తాడ్వాయి ఎస్సైకి అంత్రిక్ సురక్ష సేవ పథకం రావడం పట్ల మండల ప్రజలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2023 07:46PM