నవతెలంగాణ-గోవిందరావుపేట
ఫ్రూట్ ఫారం గ్రామం సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యతను విశిష్టతను సంతరించుకున్న జాతర అని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ అన్నారు. గురువారం జాతరను మిత్రబృందంతో కలిసి గోవింద నాయక్ సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గోవిందు నాయకులు మేళతాళాలతో ఆహ్వానించి దర్శనం కల్పించారు. అనంతరం గోవింద నాయకులు ఆలయ ప్రధాన పూజారి చల్వాయి సర్పంచ్ వీసం సమ్మయ్య శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గోవింద నాయక్ మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ జాతర ఏటుకు ఏటా ఎంతో ప్రాముఖ్యతను విశిష్టతను సంతరించుకోవడమే కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పాకి భక్తులను తన దర్శనార్థం రప్పించుకుంటుందని అన్నారు. దేవుడు సమ్మయ్య తన నిష్ట లతో అత్యంత ప్రాధాన్యతతో జాతరను నిర్వహిస్తున్నారని అన్నారు. ఒకనాడు మండలానికి పరిమితమైన జాతర ఈనాడు రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలను దర్శించుకునే భాగ్యం కలగజేయడం నిజంగా గొప్పతనమే అన్నారు. ముందు ముందు ఈ జాతర మరింత అభివృద్ధి చెంది ప్రాముఖ్యతను సంతరించుకోవాలని తాము కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మూడుతన పెళ్లి మోహన్, మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ సామి కొమ్ము ఆదిరెడ్డి, సీనియర్ నాయకులు గడ్డమీది భాస్కర్ చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాం పూర్ణచందర్, బల్గూరి రవి పాల్గొనగా వీరికి ఆలయ కమిటీ సభ్యులు బొల్లం ప్రసాదు, సామ రామ్రెడ్డి , రాజు స్వాగతం పలికి ఆహ్వానించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2023 07:48PM