నవతెలంగాణ - ఆర్మూర్
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో గురువారం జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణ ఏసీపీ ఆర్డీవో, కోర్టు, ఎంపీడీవో, పంచాయతీరాజ్, మున్సిపల్, తహసిల్దార్ ఐసిడిఎస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూతన ఆలూరు మండల కేంద్రంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాల్లో ఏసీబీ ప్రభాకర్ రావు, ఆర్టిఓ శ్రీనివాసులు, న్యాయవాదులు, ఎంపీపీ పస్కా నరసయ్య, పంచాయితీ రాజ్ రామారావు, సురేఖ, ఐసిడిఎస్ ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నూతన ఆలూరు మండల కేంద్రంలో తహసిల్దార్ దత్తాద్రి, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కళ్లెం బొజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని నలంద, శ్రీ భాషిత, లిల్లీపుట్, జెంటిల్ కిడ్స్, నారాయణ, ప్రజ్ఞ ఐఐటి, విజయ్ హై స్కూల్, విద్య హై స్కూల్, పెర్కిట్ భవిష్య దర్శిని, అంకాపూర్ భార్గవి విద్యానికేతన్ ,పెర్కిట్ కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపల్ గంగామణి తదితరుల ఆధ్వర్యంలో విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
వివిధ గ్రామాలలో...
మండలంలోని గోవింద్ పెట్, పెర్కిట్, పి ప్రీ, చేపూర్, గ్రామాలలో సొసైటీ చైర్మన్లు బంటు మహిపాల్, పెంట బొజారెడ్డి, సోమ హేమంత్ రెడ్డి తదితరులు జెండాలు ఎగురవేయగా చేపూర్ గ్రామంలో ఇందూర్ సాయన్న ,పెర్కిట్లో కౌన్సిలర్లు పాలెపు రాజు, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2023 07:51PM