నవ తెలంగాణ- రామారెడ్డి
మండలంలోని గొల్లపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పాల లావణ్య మల్లేష్ త్రివర్ణ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, బడుగు బలహీన వర్గాల తో పాటు సబ్బండ వర్ణాల కోసం భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించి, 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి రావడం, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు తో పాటు, అనేక హక్కులను కల్పించడం అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన వరం అని కొనియాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి జనార్ధన్, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల మల్లేష్, రెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2023 09:24PM