నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ మండలంలోని కంచర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శ్రీ శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్లేట్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, సేవా సమితి సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm