నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కుమారస్వామి జెండాను ఆవిష్కరించారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీధర్ జెండాను ఆవిష్కరించారు. నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో డైరెక్టర్ గంగరవేణి రాజు, రవి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకావత్ మానస సుభాష్ అధికారులు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm