- వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
నవతెలంగాణ- రామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రను గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డితో కలిసి మండలంలోని ఇస్సన్నపల్లిలో ప్రారంభించారు.
ముందుగా ఇసన్నపల్లి,( రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇస్సన్నపల్లితోపాటు రామారెడ్డి, కన్నాపూర్, కన్నాపూర్ తండాల్లో పార్టీ జెండా ఆవిష్కరించి, గడపగడపను తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు, అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలపై ప్రజలకు వివరిస్తూ యాత్ర కొనసాగింది. కార్యకర్తలకు భోజనం అందలేదని, భోజన సరపరి చేసే వారిపై దాడి చేయగా, ఇద్దరికీ గాయాలయ్యాయి.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాగన్న, పోసానిపేట్ సర్పంచ్ జి రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తూర్పు సుబ్బన్న, గిరిని రాజేందర్, నర్సింగరావు, పోతుల భాస్కర్ రెడ్డి, నామాల రవి, శివకుమార్, కన్నాపూర్ వెంకటస్వామి, కోతి లింగారెడ్డి, తిరుమన్ పల్లి నర్సారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 12:31PM