నవతెలంగాణ-కంటేశ్వర్
ఈనెల(28-01-2023)తేదీన ఉదయం పది గంటలకు విజయ్ హైస్కూల్, ఆర్మూర్ నందు ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించబడుతుంది. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మానస గణేష్, శ్యామ్ లు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు ఉమ్మడి నిజామాబాద్ (కామారెడ్డి, నిజామాబాద్) జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చు.
ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2.01.2007తేదీ తర్వాత పుట్టిన వారు అర్హులు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 10వతేదీ నుండి 12వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా విజయ్ హై స్కూల్ ఆర్మూర్ జరిగే 41వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర మరియు బాలికల బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు తీసుకొని రాగలరు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, రిపోర్టు చేయగలరు అని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 03:45PM