- ఎస్ ఎఫ్ ఐ నాయకులు
నవతెలంగాణ-కంటేశ్వర్
హాస్టల్ విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా కేటీఆర్ నిజాంబాద్ వస్తున్న సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నిస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయకుండా వస్తున్న కేటీఆర్ ను ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని విస్మరించడం దారుణం అని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కొత్త హంగులతో ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వస్తున్న కేటీఆర్ ని అడ్డుకుంటామని అన్నారు.
అదేవిధంగా మన ఊరు - మనబడి పథకం కింద అన్ని పాఠశాలలను చేర్చి అధిక బడ్జెట్ ని కేటాయించాలని అన్నారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను మూడు వేలకు పెంచాలని విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదా అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ఎవరైనా విద్యారంగ సమస్యలను పట్టించుకోని విద్యారంగా అభివృద్ధికి తోడ్పడాలని కేటీఆర్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, సిద్ధల నాగరాజు, జిల్లా నాయకులు జవహర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 03:47PM