- విధానంపై అవగాహన
నవతెలంగాణ-రాజంపేట్
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శుక్రవారం రైతులకు కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మపాని సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు వరిలో తడి పొడి విధానం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట కోఆర్డినేటర్ గడ్డం వినోద్ మాట్లాడుతూ.. వరి రసాగులో తడి పొడి విధానం వల్ల కలుగు లాభాల గురించి వివరించారు. నీటి వినియోగం తక్కువగా ఉండడానికి నీటి కొలతకు రైతులకు పైపులను అందజేసినట్టు ఆయన తెలిపారు.
తడి పొడి విధానం ద్వారా సాగు చేస్తే కాలుష్య కారకాలైనటువంటి మిథెన్ వాయువు తగ్గుతుందని పంట దిగుబడి పెరుగుతుందని ఆయన సూచించారు. దీనితో దోమపోటు చీడపీడల ఉధృతి తగ్గుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య, వార్డ్ మెంబర్ శ్రీలత, కారోబార్ సోపాన్, రైతులు వెంకట్రావు, భూంరావు, ఈశ్వర్ రావు భాస్కర్ రావు, రెస్మాయి సురేష్, పెర్క లక్ష్మణ్, గొల్ల అనిల్, గొల్ల ప్రశాంత్, భూమయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 04:47PM