- ఎబివిపి తెలంగాణ యూనివర్సిటీ
నవతెలంగాణ-డిచ్ పల్లి
యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలని యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కెటయించలని, నూతన మహిళా వసతి గృహం నిర్మించాలని, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఎబివిపి అధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బచ్చనబోయిన శివ మాట్లాడుతూ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని, యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని, నూతన మహిళా వసతి గృహం నిర్మించాలని పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న యూనివర్సిటీ సమస్యలు తీర్చకుండా ఏం మొహం పెట్టుకొని పర్యటనకు కెటిఆర్ వస్తున్నారని, పర్యాటనను అడ్డుకుంటామని వివరించారు. ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని, సమస్యలు తీర్చకుంటే మంత్రి కేటీఆర్ ని జిల్లాలో తిరగనీయమని హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేక బడ్జెట్ పెట్టి అభివృద్ధి చేయాలని లేకపోతే సీఎం మంత్రులు ఎమ్మెల్యే లను అడ్డుకుంటమని, తిరగనీయమన్నారు. వసతి గృహం లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే మరో నూతన వసతి గృహం నిర్మించాలి పేర్కొన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, విద్యాహక్కు చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో 3000 మంది విద్యార్థులు సామర్థ్యం గల ఆడిటోరియం నిర్మించాలని, 1.91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. యూనివర్సిటిలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగ సమస్య పోతుందని, విద్యార్థులను రెచ్చ గొట్టి సుమారు 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ ని, కేవలం తన కుటుంబంలో నిరుద్యోగులు లేకుండా చేసుకుంటున్నాడని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైన్స్ టెండర్ ప్రక్రియ మీద పెట్టిన ఆలోచన తెలంగాణ లో ఉన్న నిరుద్యోగ యువత గురించి ఆలోచిస్తే బాగుండేది అని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎన్నికలలో ఓడిపోయీనప్పుడు మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతూ నిరోద్యోగులకు ఆశ కల్పిస్తూ కేవలం పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితం చేస్తూ నిరుద్యోగులకు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా పేపర్ ప్రకటనకు మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్ పరిమితం కాకుండా, ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, ఇందూరు జిల్లా ఎస్ ఎఫ్ డి ఎస్ ఎఫ్ డి కన్వీనర్ ప్రమోద్, ఎగ్జిక్యూటివ్ నెంబర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 04:51PM