నవతెలంగాణ-డిచ్ పల్లి
అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో బడ్జెట్ కేటాయింపులు చాలా కీలకంగా మారుతాయి. బడ్జెట్లో క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ అనే రెండు ప్రధాన భాగాలుగా ఉంటాయని, బడ్జెట్ కేటాయింపులు దేశాభివృద్ధికి దారులు వేస్తున్నాయని అర్థశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సంపత్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగంలో" ప్రీ బడ్జెట్ ఎనాలసిస్ సింపోసిజం" అనే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడ్జెట్ లో పెట్టుబడి పద్దు, నిర్వహణ పద్దు అనే రెండు కేటాయిస్తారని, పెట్టుబడి పద్ధతి కి అధికంగా బడ్జెట్ కేటాయించి నట్లయితే దీర్ఘకాలంలో అభివృద్ధి చెందుతుందని డాక్టర్ పున్నయ్య విశ్లేషించారు.
తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక దేశ అభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయింపులు కేటాయించాలని, దేశ ప్రజల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు ఉండాలని డాక్టర్ స్వప్న తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దత్త హరి, డాక్టర్ ప్రభంజన్, డాక్టర్ రామలింగం, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మోహన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 04:53PM