నవతెలంగాణ-కంటేశ్వర్
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ లు చిత్రా మిశ్రా చంద్రశేఖర్ లతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ద నూతనంగా చేపట్టనున్న కళాభారతి ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే, కంటేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు. అంతకుముందు భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో జరుగనున్న కార్యక్రమంలో మంత్రి పాల్గొని రైతులతో ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పై ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా మంత్రి హాజరవుతుండడంతో, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ ను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా మంత్రి కేటీఆర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతా పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మనోహర్ రెడ్డి, నగర పాలక సంస్థ ఇంజినీర్ రషీద్, ట్రాన్స్ కో ఏ.డీ.ఈ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 04:56PM