నవతెలంగాణ-డిచ్ పల్లి
74వ ఘనతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజ్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సీఈఓ గా ఇందల్ వాయి సహకార సొసైటీ సీఈఓ గా విధులు నిర్వహిస్తున్న ఉప్పలవాయి రతన్ కు ఉత్తమ సిఈ ఓ గా అవార్డును బహూకరించారు. గత కొన్ని ఏళ్లుగా సహకార సొసైటీలో రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందజేస్తూ,అందరి మన్ననలు పోందుతు ఉత్తమ సి ఈ ఓ గ ఎంపిక కావడం పట్ల సహకార సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, సహకార సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm