- అయోమయంలో మండల ,గ్రామస్థాయి అధికారులు
- అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న మండల ప్రజలు
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని 74వ గణతంత్ర దినోత్సవం నాడు ఎప్పటిలాగానే సర్పంచులు జెండాను ఎగరవేసినారు. వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన నియమావళి ప్రకారం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, జెండాను ఎగరవేయాలి. అలాగే మండల, గ్రామస్థాయి లలో ఎగ్జిక్యూటివ్ అధికారులు, గణతంత్ర దినోత్సవం నాడు ఎగరవేయాలని నియమావళి ఉంది. కానీ దీనికి విరుద్ధంగా కన్నాయిగూడెం మండలంలోని దాదాపు అన్ని గ్రామపంచాయతీలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్పంచులు జెండాను ఎగరవేశారు.
దీంతో గ్రామస్థాయిలో ఎగ్జిక్యూటివ్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉన్నప్పటికీ సర్పంచులు జెండాను ఎగరవేయడం ఏంటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను మండల స్థాయి గ్రామస్థాయిలలో అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం వలన సమాచార లోపం కొరవడిందని దీంతో ఆనవాయితీగానే సర్పంచులు గణతంత్ర దినోత్సవ నాడు జెండాను సర్పంచులు ఎగరవేసి ఉంటారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం జిల్లా మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యమే నని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి సంఘటన ఇలాగే కొనసాగితే మండలంలో భావితరాలకు ఇలాంటి సందేశం వెళుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యపు ధోరణి వీడి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని మండల ప్రజలు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 05:23PM