- రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి
- సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్
నవతెలంగాణ-తాడ్వాయి
అంగన్వాడిల సమస్యలు పరిష్కారం చేయాలనీ, అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయం అధికారికి వినతిపత్రం అందించారు. ఈ ధర్నా కు ముఖ్య అతిధిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ హాజరై మాట్లాడుతూ ఐసీడీఎస్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తూ రాబోయో కాలంలో ఆ పథకాన్నీ ఎత్తి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
కనీసవేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్ హెచ్ టి ఎస్ యాప్ రద్దు చేసి పోషన్ ట్రాకర్ యాప్ మాత్రమే ఉంచాలని అన్నారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న టి ఏ, డి ఏ లు వెంటనే ఇవ్వాలి అన్నారు. ఆన్లైన్లో రిపోర్ట్స్, రాతపూర్వకంగా రిపోర్ట్స్ లలో ఏదో ఒకటి మాత్రమే చెప్పాలని అన్నారు. మినీ సెంటర్స్ ను జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండా ప్రతి మినీ కేంద్రాన్ని మెయిన్ కేంద్రంగా చేయాలి మెయిన్ టీచర్ తో సమాన జీతం ఇవ్వాలి అన్నారు. పెండింగ్ లో ఉన్న గ్యాస్ బిల్లులు, ఇంటి అద్దెలు, ఆరోగ్యలక్ష్మి బిల్లులు ఇవ్వాలి అన్నారు. అన్నిరకాల స్టాక్ ఒకేసారి వేయాలి, నాణ్యమైన కోడిగుడ్లు, ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు కె సరోజన, కె సమ్మక్క, పద్మారాని,జమున రాని, భాగ్య, నిర్మల, ఆధి లక్ష్మి, రుక్మిణి, మంజుల, సరిత, రజిత, రమ, సుమలత, పుష్పతో పాటు 60 మంది పాల్గొన్నారు.