- బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మి నర్సయ్య
నవతెలంగాణ-నవీపేట్
భావి భారత భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉందని అందుకే వారిలో విజన్ పెంచేందుకే పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ చేపట్టారని అన్నారు. మండలంలోని జన్నేపల్లి ఎస్ ఎస్ ఆర్ పాఠశాలలో శుక్రవారం పరీక్ష పే చర్చ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారని అన్నారు.
ప్రధానమంత్రి మోడీ ముందు చూపు ఉన్న నాయకుడని విద్యార్థులు సైతం తమ జీవిత లక్ష్యంపై ముందస్తు అవగాహన పెంపొందించుకోవాలని వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మండల అధ్యక్షులు ఆదినాథ్, సర్పంచ్ సరీన్, ఎంపీటీసీ రాదా, వడ్డేపల్లి సర్పంచ్ శ్రీధర్, సీనియర్ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, వంశీ మోహన్, రామకృష్ణ, రచ్చ సుదర్శన్, రమణారావు, సత్యం రెడ్డి, భూషణ్, ప్రదీప్, మల్లెపూల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 06:14PM