- బెజ్జంకి క్రాసింగ్,తిమ్మాయిపల్లి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
నవతెలంగాణ-బెజ్జంకి
గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు ఎల్లవేళలా తోడ్పాటును అందించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్, తిమ్మాయిపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న గ్రామ పంచాయతీ, మహిళ సంఘాల భవనాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేశారు. తిమ్మాయిపల్లిలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి కృషి చేయాలని పలువురు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు.
అనంతరం మండలంలో పలు వివాహాలకు ఎమ్మెల్యే హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎఎంసీ చైర్మన్ రాజయ్య, అయా గ్రామాల సర్పంచులు టేకు తిరుపతి, కవ్వ లింగారెడ్డి, ఎంపీటీసీ మల్లేశం, మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్ దీటీ రాజు, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 06:19PM