నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక బాలికల,బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను శుక్రవారం జెడ్పీ సీఈఓ రమేశ్, డీఎల్పీఓ రాజీవ్ కూమార్ సందర్శించి పరిశీలించారు. అనంతరం అయా పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రాబోయే పది పరీక్షల్లో ఉత్తమ పలితాలు సాదించాలని సూచించారు. అయా గ్రామాల సర్పంచులు ద్యావనపల్లి మంజుల,సంజీవ రెడ్డి, ఎంపీడీఓ రాము, వైద్యాధికారి వినోద్ బాబ్జీ, ఎస్ఎంసీ చైర్మన్ శంకర్, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm