నవతెలంగాణ-భిక్కనూర్
పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంపీపీ గాల్ రెడ్డి అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన బీర్కూరి లింగం 6 డేస్కులను, స్థానిక సర్పంచ్ సులోచన సుదర్శన్ లక్ష రూపాయల సొంత ఖర్చుతో స్టేజి నిర్మాణం, గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఎంపీపీ గాల్ రెడ్డి 20 వేల రూపాయలతో పాఠశాలకు పెయింటింగ్ కొరకు సహకరించడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయురాలు రాధా లక్ష్మి తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామస్తులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ 10వేలు, చంద్ర లీల 20వేలు, ఎన్ఎస్ శ్రీనివాస్ 10వేలు, రామకృష్ణ 10 వేల రూపాయలను అభివృద్ధికి సహకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సులోచన సుదర్శన్, మాజీ ఎంపీపీ సుదర్శన్, ఉపసర్పంచ్ సిద్దా గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ చారి, ఎంఈఒ కార్యలయ కంప్యూటర్ ఆపరేటర్ వైద్య సంపత్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వీడీసీ సభ్యులు, గ్రామ సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 06:32PM