నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణానికి చెందిన మానస అనే యువతి వివాహానికి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు ఎర్రం ఆంజనేయులు తనవంతుగా పుస్తె మట్టలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన యువతుల వివాహానికి తనవంతుగా పుస్తె మట్టలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి,ఇసన్నపల్లి గ్రామ సర్పంచ్ గుడిసె రాములు, నాయకులు అందె మహేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కే జే ఎల్ శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం గౌడ్, సుబ్బారావు, యువతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm