నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి పంచాయతీ ఫ్రూట్ ఫారం గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావులు దర్శించుకుని సమ్మక్క జాతర సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ శంకర్ ఎస్సై కరుణాకర్ రావులు ఫ్రూట్ ఫారం జాతర ప్రాముఖ్యతను ప్రధాన పూజారి సర్పంచ్ వీసం సమ్మయ్య ను అడిగి తెలుసుకున్నారు. 1984వ సంవత్సరం నుండి ఫ్రూట్ ఫారం గ్రామంలో తన సొంత భూమిలో ఒక చిన్న కంక పోద కింద ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు సమ్మయ్య వివరించారు.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి భక్తులు నిరంతరం వారి వారి సమస్యల పరిష్కారం కోసం ఫ్రూట్ ఫారం సమ్మక్క తల్లి దర్శనార్థం వస్తుంటారని తెలిపారు. ఇక్కడ ఎంతో నియమ నిష్టలతో తల్లిని కొలుస్తామని ఆ తల్లి చల్లని దయవల్ల అందరికీ మంచి జరుగుతుందని ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని వారికి తగిన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చూసుకుంటున్నారని సమ్మయ్య అన్నారు. జాతరను సందర్శించే వారిలో ఉద్యోగులు సామాన్య ప్రజలు ప్రజాప్రతినిధులు మొదలుకొని ఇతర రాష్ట్రాల నుండి కూడా తల్లి దర్శనార్థం వచ్చి ఆశీస్సులను పొంది తిరుగు ప్రయాణం చేస్తారని తెలిపారు.
తనకు బాల్యం నుండే సమ్మక్క తల్లి ఆవహించడం వల్ల జాతరను నిర్వహిస్తున్నట్లు సమ్మయ్య తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి పొరపొచ్చాలు గాని దుర్ఘటనలు గాని లేకుండా సజావుగా జాతర నిర్వహించినట్లు ఇకముందు కూడా జాతర ప్రాముఖ్యతను తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి భక్తులకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొల్లం ప్రసాద్.రాజు రఘు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 06:39PM