జిల్లా వ్యవసాయ అధికారి రాయుడు తిరుమల ప్రసాద్..
నవతెలంగాణ-డిచ్ పల్లి
పంటలో చీడపీడలు వచ్చినప్పుడు రైతులు ఎలాంటి ఆందోళన చెందోద్దని అధికారుల సూచన సలహాల మేరకు నివారణ చర్యలు చేపట్టే విధంగా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాయుడు తిరుమల ప్రసాద్ అన్నారు శుక్రవారం ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి రాయుడు తిరుమల ప్రసాద్, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి క్షేత్రస్ధాయి పర్యాటక చేపట్టారు.పర్యటనలో భాగంగా వెంట నమోదు వివరాలు, పర్యవేక్షణ చిడపీడల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు తగు సూచలను సస్యరక్షణ చర్యల పై వివరించారు.
వరి కాండం తొలుచు పురుగు నివారణ మరియు ఆకు ముడత పురుగు నివారణకు రికార్పాప్ హైడ్రోక్లోరైడ్ 299/ లిటరి g క్లోరాంభ వివిలిప్రోల్ 6oమీలి పిచికారి చేసుకోవాలని సుచించారు.పంటలో చీడపీడల వచ్చినప్పుడు రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ అధికారులు సూచించిన పురుగు మందులు వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి రైతులకు వివరించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీహరి రైతులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 07:09PM