నవ తెలంగాణ- రామారెడ్డి
మండలంలో రెండవ రోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర శుక్రవారం గొల్లపల్లి, రంగంపేట, మోషన్ పూర్, ఉప్పల్ వాయి గ్రామాలలో కొనసాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నామాల రవి, కోతి లింగారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm