నవతెలంగాణ - అశ్వారావుపేట
పలువురు తహశీల్దార్ లను బదిలీలు చేస్తూ కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసారు.
జూలూరుపాడు తహశీల్దార్ పనిచేస్తున్న విల్సన్ అశ్వారావుపేట కు అశ్వారావుపేట తహశీల్దార్ ప్రసాద్ ను పినపాక బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశించారు.
అయితే గతం లో అశ్వారావుపేట డి.టి. గా పనిచేస్తూ పదోన్నతి పై జూలూరుపాడు వెళ్ళిన విల్సన్ తిరిగి అశ్వారావుపేట తహశీల్దార్ గా రానున్నారు. 2004 నుండి 2006 వరకు జూనియర్ అసిస్టెంట్ గా అశ్వారావుపేట లోనే పనిచేసిన ప్రసాద్ 2019 లో తహశీల్ధార్ ఇక్కడకు వచ్చారు.