- ఎన్నో ఏళ్ల కళ సఫలమౌతున్న వేళ
- మల్లాపూర్,లోలం లో ఆదివారం ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటన..
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్, లోలం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం ప్రారంభోత్సవాలు నిర్వహించ నున్నట్లు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, మమత శేఖర్ లు శుక్రవారం నవ తెలంగాణకు తెలిపారు.అర్టీసి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటనను పురస్కరించుకొని గ్రామపంచాయతీ, బ్రిడ్జ్, కమ్యూనిటీ హాల్లను సుందరంగా తీర్చిదిద్దుతు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, క్రిమిటోరియా, మహిళ భవనం, వైకుంఠధామం, కల్యాణ మండపాలు, సిసి డ్రైనేజీ, రహదారుల నిర్మాణం లకు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రఘునాథన్ రాము వివరించారు. సమీప గ్రామాల ప్రజలు ఎన్నో ఏండ్ల కళ మల్లాపూర్, లోలం బ్రిడ్జికి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు.గ్రామంలో వైకుంఠధామం, రైతు వేదిక, మహిళ భవనం, కమ్యూనిటీ హాల్లు, సీసీ డ్రైనేజ్,పలు రహదారులకు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నట్లు సర్పంచ్ మమత శేఖర్, ఎంపిటిసి డికొండ సరిత సుధాకర్ లు తెలిపారు. దానిలో భాగంగానే ఎన్నో ఏండ్ల కళ సఫలమైతున్న వేళ బ్రిడ్జి కి నిర్మాణం పూర్తి కావడం తో గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బ్రిడ్జి నిర్మాణం చేపడతానని హామీనిచ్చి ఆ హామీని నెరవేర్చారని గతంలో ఎన్నో ఏళ్ల నుండి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పలుమార్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి లోలం మల్లాపూర్, బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన నయ పైసలు నీదులు కేటాయించక పోవడంతో బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి నిధులను మంజూరు చేసి శంకుస్థాపన శిలఫలకం లేకుండానే ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులను మంజూరు చేసి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పనులు పూర్తి చేయించారు కానీ పనులు పూర్తయిన తర్వాత నే ప్రారంభోత్సవం చేస్తానని ఆనాడు ఇచ్చిన మాట నేడు అక్షరాల సత్యంగా మారిందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాలకు ఎమ్మెల్యే మిగిలిపోయిన పనులకు నిధులు కేటాయిస్తారని ఎన్నో ఆశలతో గ్రామస్తులు ఉన్నారు. ఎంఎల్ఏ బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అడిగిన వెంటనే నిధులను కేటాయిస్తున్నారని గ్రామానికి వరాల జల్లు కురిపిస్తారని నాయకులు పేర్కొన్నారు.లోలం గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్న ప్రారంభానికి నోచుకకపోవడంతో ప్రార్థనమైన గ్రామపంచాయతీ భవనంలోనే పాలన కొనసాగించారు ఈ విషయమై నవ తెలంగాణ లో కథనం వచ్చిన నాటి నుండి నాయకులు ప్రారంభోత్సవానికి పూనుకొని తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతోపాటు గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న సిసి రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలు,కుల సంఘాల భావన నిర్మాణలకు నిధులు కేటాయిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని పలువురు పేర్కొన్నారు.