నవతెలంగాణ - అశ్వారావుపేట
ఈశ్రమ్ (e-SHRAM) పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికుల జాతీయ డేటాబేస్ "ఉచిత” నమోదు చేసి వారికి సామాజిక భద్రత కల్పించడమే ఈశ్రమ్ ప్రభుత్వ లక్ష్యం అని ఇంచార్జీ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ యం.డి షర్ఫోద్ధీన్ తెలిపారు. ఆయన శుక్రవారం ఈశ్రమ్ ఫోర్టల్ పలు కార్మిక సంఘాల నాయకులకు,కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 ఆగస్టు 26 నుండి ఈశ్రమ్ పోర్టల్ ప్రారంభం అయిందని తెలిపారు.
ముఖ్య ఉద్దేశ్యం:
అసంఘటితరంగ కార్మికులందరినీ e-SHRAM పోర్టల్లో నమోదు చేసి వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించడం.
ప్రయోజనాలు:
1) ఇందులో చేరిన ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు
(UAN) - (యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబరు) ఇవ్వడం జరుగుతుంది.
2) ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది.
3) ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) క్రింద రూ. 2 లక్షల ప్రమాద మరణ / అంగవైకల్య బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుంది.
4) ప్రభుత్వం అసంఘటితరంగ కార్మికులనుద్దేశించి చేసే పథకాలు & విధానాలకు ఈ డేటాబేసి నే ప్రామాణికంగా తీసుకోనున్నారు.
5) వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించడం.
ఈ పథకంలో చేరడానికి అర్హులు ఎవరంటే
1) 16 నుండి 59 సంవత్సరాల వయస్సులోపు వారు.
2) ఆదాయపు పన్ను(IncomeTax)పరిధిలోనికి రాని వారు.
3) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) మరియు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (ESI) సదుపాయం లేనివారు.
4) అసంఘటితరంగ కార్మిక కేటగిరిలలో తప్పనిసరిగా పనిచేస్తూ ఉండాలి.
అసంఘటిత రంగ కార్మికులు ఎవరంటే: వ్యవసాయ, అనుబంధ ఉపాధుల పనివారు: చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన మరియు దాని అనుబంధ రంగాలలో పనిచేసేవారు - తాపీ, తవ్వకం, రాళ్లు కొట్టేపని, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, సానిటరీ, పేయింటర్, టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్చర్, బావులు తవ్వడం / పూడిక తదితరులు
అప్పారెట్ - టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్స్,
ఆటో మొబైల్ & రవాణా రంగం - డ్రైవర్లు, హెల్పర్లు..
చేతి వృత్తుల పనివారు చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, క్షౌరవృత్తి, బ్యూటి పార్లర్లలో పని చేసేవారు, చర్మకారులు, రజకులు.
''స్వయం ఉపాధి - వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారస్తులు, ఇంటి వద్ద వస్తువులు
తయారీ, చిరు వ్యాపారులు, కల్లుగీత, కళాకారులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, చెత్త ఏరేవారు.
సేవారంగం పనివారు - ఇళ్ళల్లో పనిచేసే పాచి పనివారు, కొరియర్ బాయ్స్, ఇంటి వద్ద రోగులకు సేవలు అందించేవారు, కమీషన్ మీద వస్తువులు సరఫరా చేసేవారు.
ప్రభుత్వ పథకాల అమలు పని వారు. NREG వర్కర్లు, ఆశా వర్కర్లు SHG స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, మిడ్ డే మిల్ వర్కర్లు, విద్యా వాలంటీర్లు, గ్రామ/ వార్డు
హమాలీలు - లోడింగ్, ఆన్ లోడింగ్,
దుకాణాలు / సంస్థలలో పనిచేసే (EPF & ESI లేని వారు, ఆహార పరిశ్రమ - బేకరీ, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్ తయారీదారులు, వలస కార్మికులు
నమోదు కావడానికి కావలసిన పత్రాలు (Documents) :
1. ఈకేవైసి (e-kYC) కలిగిన ఆధార్
2. ఆధార్ అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబరు. 3. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మొబైల్ ఫోన్ నెంబరుకు OTP వస్తుంది.
4. OTP సదుపాయం లేనివారు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా రన్నింగ్ ఉన్న బ్యాంకు అకౌంట్ మరియు IFSC కోడ్
ఎక్కర నమోదు చేసుకోవాలి :
మీ సమీప ప్రాంతాలలోని గ్రామ / వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వెంటనే UAN కార్డు జారీ చేయబడును.
ముఖ్యగమనిక : నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితం.
మరిన్ని వివరాలకు మీ సమీపంలోని గ్రామ/ వార్డు సచివాలయాలు CSC సెంటర్లు లేదా కార్మిక శాఖ కార్యాలయములు సంప్రదించగలరని కోరారు. ఆయన వెంట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్,వెంకన్న బాబు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 08:16PM