- రూ. 11,111 వేలు అందజేత
నవ తెలంగాణ - సిద్ధిపేట
ఢిల్లీలో ఈ నెల 23న పార్లమెంట్ లో జరిగిన "నేతాజీ లైఫ్ అండ్ లగేసీ అమెరికాల్ " స్పీచ్ కంపిటేషన్ లో పాల్గొన్న సిద్ధిపేట పట్టణానికి చెందిన బండవరపు శ్రీవర్షిణిని శుక్రవారం ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రదర్ గౌడ్ తన కార్యాలయoలో శాలువాతో సన్మానించి రూ 11,111 ల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యువత అన్నీ రంగాలలో ముందుండాలని సూచించారు. ప్రతీ ఒక్కరు శ్రీ వర్షిణిని ఆదర్శoగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో జరిగిన ప్రోగ్రాంలో మన సిద్ధిపేట గూర్చి చర్చించారా అని ఆరా తీసారు. ఈ కార్యక్రమంలో అరుషికా పాల్గొన్నారు.