- సారలమ్మ గుడిని కూలగొట్టిన ఫారెస్ట్ అధికారులు
నవతెలంగాణ -తాడ్వాయి
తాడ్వాయి ఏజెన్సీ మండల కేంద్రంలోని ఫారెస్ట్ హాట్స్ ఎదురుగా, కాటాపూర్ వెళ్లే రోడ్డు పక్కన గల ఆదివాసీల సార్లమ్మ గుడిని శుక్రవారం మధ్యాహ్నం ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా కూలగొట్టారు. ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం ఈ సారలమ్మ ఆలయం ఆదివాసీలు పూజలు నిర్వహించుకుంటారు.
గత 70, 80 సంవత్సరాల క్రితం నుండి హాట్స్ నిర్మించక ముందు నుండే ఈ గుడి ఉంది. ఆ గుడి లో ఆదివాసీలు పెద్దల పండుగ, కొత్తల పండుగ, లను ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అలాంటి ఆలయాన్ని ఫారెస్ట్ అధికారులు కూలగొట్టడం హేయమైన చర్య అని ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీలో ఫారెస్ట్ అధికారులు ఏజెన్సీ సాంప్రదాయాలకు విరుద్ధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయాన్ని కులగొట్టారని ద్వజమెత్తారు. ఏజెన్సీ అభివృద్ధికి ఆటంకగా ఫారెస్ట్ అధికారులు మారారని దుయ్యబట్టారు. అధికారులు స్పందించి తాడ్వాయి లో సార్లమ్మ ఆలయం కూలగొట్టిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఆదివాసులు డిమాండ్ చేశారు. కాగా ఈ విషయమై ఫారెస్ట్ ఆఫీసు ముందు నేడు ధర్నా కూడా నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది.