నవతెలంగాణ-కొత్తగూడ: ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కొత్తగూడ ఎస్సై నగేష్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గోవిందాపురం గ్రామానికి చెందిన బీరబోయిన వంశీ తండ్రి లక్ష్మీనారాయణ (లేట్) అను వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుండి మద్యానికి బానిస అయ్యి తాగడానికి,జల్సా చేయడానికి డబ్బులు లేక తిరుగుతూ ఉండేవాడని, ఈ క్రమంలో తేదీ 21-01-2023 రోజు రాత్రి మోకాళ్ళపల్లి గ్రామంలో ఇంటి ముందు పార్క్ చేసిన గ్లామర్ బండిని దొంగలించాడన్నారు. అట్టి ద్విచక్రవహనాన్ని శుక్రవారం సాయంత్రం విక్రయించేందుకు వెళ్తుండగా కొత్తగూడ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా వస్తూ పట్టుబడగా ఆ బండిని స్వాధీనం పరుచుకొని బీరబోయిన వంశీని జ్యుడీషియల్ రిమాండ్ తరలించినట్లు ఎస్సై తెలిపారు. యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మంచి మంచి ఉపాధి మార్గాలను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm