నవతెలంగాణ-బెజ్జంకి
2022 డిసెంబర్ 12న మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని డికొట్టి పరారవుతున్న వాహనాన్ని చేదించి వివరాలు అందజేసిన ఆటో డ్రైవర్ కనగండ్ల సురేశ్ ను శనివారం బెజ్జంకి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడు శంకరా చారి శాలువా కప్పి ఆత్మీయ సన్మానం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితుడికి సహకారం అందించడం అనందనీయమని సురేశ్ ను అభినందించారు. ఆటో డ్రైవర్ల్ యాదగిరి, రాజేశం, మనోజ్, శేఖర్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm