నవతెలంగాణ-బెజ్జంకి
జాతీయ మిని అండర్-14,ఓపెన్-9 ఆర్చరీ విభాగాల్లో మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన బండి స్నిగ్ధ మూడు స్వర్ణ పథకాలు సాదించాడు. శనివారం గ్రామంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద స్వర్ణ పథకం సాధించిన విద్యార్థి స్నిగ్ధను సర్పంచ్ పెంటమీదీ శ్రీనివాస్, వార్డ్ సభ్యులు అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆర్చరీ విభాగంలో మూడు స్వర్ణ పథకాలు సాదించి జాతీయ స్థాయిలో గ్రామానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావడం అభినందనీయమని సర్పంచ్ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు.పంచాయితీ కార్యదర్శి,గ్రామస్తులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm